ట్రాక్టర్ పైనుంచి పడి చిన్నారి మృతి
తిప్పర్తి : ట్రాక్టర్‌పై తండ్రి ఇంటి నుంచి వెళ్తుండగా.. తాను వస్తానని రెండేళ్ల కుమార్తె మారం చేసింది. దీంతో ఆమెను తండ్రి ట్రాక్టర్‌పై ఎక్కించుకుని కొద్దిదూరం తిప్పేందుకు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆ చిన్నారి ట్రాక్టర్ పైనుంచి కిందపడి మృతిచెందింది. ఈ ఘటన తిప్పర్తి మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన కొల్లు సైదులు, అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. శనివారం సైదులు తన ట్రాక్టర్‌పై యూరియా బస్తాలు వేసుకురావడానికి వెళ్తుండగా.. తానూ వస్తానని పెద్ద కుమార్తె మనస్విని(2) మారం చేయడంతో ఆమెను కూడా ట్రాక్టర్‌పై ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ట్రాక్టర్‌ను ముందుకు కదిలించడంతో మనస్విని ట్రాక్టర్ పైనుంచి రోడ్డుపై పడిపోయింది. బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందింది. ఆడుతూ పాడుతూ ఇంట్లో తిరిగే చిన్నారి మృతిచెందడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మర్రిగూడ : భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటుందని మనస్తాపంతో ఉరేసుకున్న వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. వివరాలు.. మర్రిగూడ మండలం వెంకేపల్లితండాకు చెందిన జటావత్ బాలాజీ(35) భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుండడంతో మనస్తాపానికి గురైన బాలాజీ నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఉరేసుకున్నాడు. అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి తమ్ముడు సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మర్రిగూడ ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ట్రాక్టర్ పైనుంచి పడి చిన్నారి మృతి


