వరి సాగు 80 శాతం
యాసంగిలో రైతులు ఎక్కువగా వరి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు 80 శాతం మేర వరిసాగు పూర్తయ్యింది. మరో 15 రోజుల్లో వరి నాట్లు పూర్తి కానున్నాయి.
వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
భువనగిరి: యాసంగి సీజన్‌లో వరి అంచనాకు మించి సాగుకానుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇప్పటి వరకు 80 శాతం మేర వరి నాట్లు పూర్తయ్యాయి. మరో 15రోజుల్లో ఇంకా 20 శాతం సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి వర్షాలు అధికంగా కురువడంతో చెరువులు, కుంటలు జల కళను సంతరించుకున్నాయి. భూగర్భ జలం పెరగడంతో రైతులు ఆరుతడి పంటలకు బదులు వరి సాగువైపు మొగ్గుచూపుతున్నారు. కూలీల కొరత వల్ల వరి నాట్లు వేయడంలో జాప్యం అవుతోంది. దీనితోడు కొంత మంది రైతులు కొత్తగా భూ జల మట్టం అధికంగా ఉండటం వల్ల వరి సాగు చేయడం ప్రారంబించారు.
3.30లక్షల ఎకరాల
వరకు సాగవుతుందని..
గత యాసంగితో పోలిస్తే ప్రస్తుతం సీజన్‌లో వరి సాగు గణనీయంగా పెరగనుంది. గత అక్టోబర్, నవంబర్ మాసాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. అలాగే ఇటీవల వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించడం.. రైతులకు చెల్లింపులు త్వరగా చేయడం తదితర కారణాలతో వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో రైతుల ఽవిక్రయించుకున్న ధాన్యానికి డబ్బుల చెల్లింపుల్లో కలెక్టర్, సివిల్ సప్లఈస్ , డీఎస్‌ఓ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గత సీజన్‌లో 2.86 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ సారి 3.12 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 3.02 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తి అయ్యాయి. ఇంకా రాజాపేట, పోచంపల్లి, ఆలేరు మండలాల పరిధిలో వరి నాట్లు కొనసాగుతున్నాయి. మరో 15 రోజుల పాటు వరి సాగు పనులు కొనసాగే అవకాశం ఉంది. దీంతో వరి సాగు 3.25 లక్షల ఎకరాల నుంచి 3.35 లక్షల ఎకరాల వరకు అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఫ ఇప్పటికే 3లక్షల ఎకరాల్లో వరినాట్లు
ఫ మరో 15 రోజుల్లో నాట్లు పూర్తయ్యే అవకాశం
ఫ అంచనాకు మించి సాగుకానున్నట్లు భావిస్తున్న అధికారులు
యాసంగి సాగు వివరాలు.
(లక్షల ఎకరాల్లో..)
సంవత్సరం సాగు విస్తీర్ణం
2023 2.80
2024 2.86
2025 3.02
(ఇప్పటి వరకుసాగు)


