కడసారి చూపు కోసం వస్తూ.. కానరాని లోకాలకు | - | Sakshi
Sakshi News home page

కడసారి చూపు కోసం వస్తూ.. కానరాని లోకాలకు

Mar 5 2026 8:55 AM | Updated on Mar 5 2026 8:55 AM

మునగాల, అనంతగిరి: అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వస్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం మునగాల మండలంలోని ఆకుపాముల శివారులో భగత్‌సింగ్‌ కళాశాల ఎదురుగా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం మొగలాయికోట గ్రామానికి చెందిన కిన్నెర పుల్లయ్య అనారోగ్యానికి గురై మంగళవారం రాత్రి మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన ఆయన సమీప బంధువులు కిన్నెర దావీదు(26), కొండ్రు వంశీ(28) ఇద్దరూ ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా బుధవారం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తన స్నేహితులైన మార్కు బుడిరాజ్‌కుమార్‌, పెద్దపండు వెంకట్‌తో కలిసి మొగలాయి కోట గ్రామానికి కారులో బయలుదేరారు. అతివేగం కారణంగా కారు మునగాల మండలంలోని ఆకుపాముల శివారులో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కిన్నెర దావీదు, కొండ్రు వంశీ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్‌, పెద్దపండు వెంకట్‌ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాదం జరిగిన కారులో ఇరుక్కుపోయిన ఈ నలుగురిని వెలికి తీసేందుకు స్థానికుల సాయంతో పోలీసులు సుమారు రెండు గంటల పాటు శ్రమించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు.

వంశీ (ఫైల్‌)

దావీదు (ఫైల్‌)

మొగలాయికోటలో విషాదం

మృతులు దావీద్‌, వంశీ ఇద్దరూ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లి ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. దావీదు తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా అక్క ఉన్నది. ఆమెకు సుమారు 9 నెలల క్రితం వివాహం జరిపించాడు. దావీదు అకాల మరణంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా.. వంశీకి తల్లితో పాటు అక్క ఉండగా ఆమెకు సుమారు 8 నెలల క్రితం విహహం చేశాారు. తల్లిని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వంశీ మృతిచెందడంతో తల్లి ఒంటరిగా మిగిలింది. ఇద్దరి యువకులు మృతిచెందడంతో మొగలాయికోట గ్రామంలో విషాదం చాయలు అలుముకున్నాయి. మృతులను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలకు మొగలాయికోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అదుపుతప్పి కారు బోల్తా

ఇద్దరు యువకులు మృతి,

మరో ఇద్దరికి తీవ్రగాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement