మోత్కూరు వాసికి డాక్టరేట్
మోత్కూరు : మోత్కూరు పట్టణానికి చెందిన దునుక సుదర్శన్, లక్ష్మి దంపతుల కుమార్తె సరితకు వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఫార్మసీ విభాగంలో ‘డెవలప్‌మెంట్ అండ్ ఫార్ములేషన్ ఆఫ్ నానో కారియర్ బేస్డ్ ట్రాన్స్ థర్మల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ఆఫ్ సెలెక్టెడ్ డ్రగ్స్’ అనే అంశంపై ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి పర్యవేక్షణలో ఆమె చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ ప్రకటించారు. త్వరలో గవర్నర్ చేతుల మీదుగా ఆమె డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు. సరితకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.


