రహదారులపై ‘ఇక్కత్‌’ పరుగులు | - | Sakshi
Sakshi News home page

రహదారులపై ‘ఇక్కత్‌’ పరుగులు

Mar 1 2026 7:16 AM | Updated on Mar 1 2026 7:16 AM

రహదార

రహదారులపై ‘ఇక్కత్‌’ పరుగులు

భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి ఇక్కత్‌ డిజైన్‌ పోస్టర్‌ కల్గిన ఆర్టీసీ బస్సు శనివారం పోచంపల్లిలో సందడి చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దేశంలోనే ప్రప్రథమంగా జీఐ గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ‘జీఐ ఆన్‌ వీల్స్‌’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శనివారం నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి పోచంపల్లికి ప్రత్యేక బస్సు సర్వీస్‌ను నడిపిస్తోంది. ఇందు కోసం ఆర్టీసీ బస్సుపై పోచంపల్లి ఇక్కత్‌ డిజైన్‌కు సంబంధించిన పోస్టర్‌ను రూపొందించి బస్సు వెనుక ‘పోచంపల్లి నుంచి ప్రపంచానికి’ అనే ట్యాగ్‌ను రూపొందించింది. తద్వారా పోచంపల్లి ఇక్కత్‌కు మరింత గుర్తింపును తీసుకరావడంతో పాటు ఉపాఽధి కల్పించడం, అదేవిధంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ ప్రత్యేక బస్సు ప్రతిరోజు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి పోచంపల్లికి నాలుగు ట్రిప్పుల చొప్పున నడుస్తుందని తెలిపారు.

రహదారులపై ‘ఇక్కత్‌’ పరుగులు1
1/1

రహదారులపై ‘ఇక్కత్‌’ పరుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement