సాగు, తాగునీటికి నిధులు కేటాయించాలి
భువనగిరిటౌన్ : వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే 2026 – 27 వార్షిక బడ్జెట్లో జిల్లాలో సాగు , తాగునీరు కోసం, మూసీ జల కాలుష్య నివారణకు, విద్య , వైద్యం, రహదారులు , ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు యం.డి. జహంగీర్ డిమాండ్ చేసినారు. బడ్జెట్‌లో జిల్లాకు తగిన నిధులు కేటాయించాలని కోరుతూ సోమవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ హనుమంతరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ , బట్టుపల్లి అనురాధ, నాయకులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బొలగాని జయరాములు, మాయ కృష్ణ, గంగాదేవి సైదులు, ఎంఏ. ఇక్బాల్, మధ్యపురం రాజు పాల్గొన్నారు.


