గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి

Feb 21 2026 8:15 AM | Updated on Feb 21 2026 8:15 AM

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి

భూదాన్‌పోచంపల్లి : గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పురంలో గల స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండో విడతగా బొమ్మలరామారం, ఆలేరు, అడ్డగూడూరు, రామన్నపేట మండలాలకు చెందిన నూతన సర్పంచులకు ఇస్తున్న శిక్షణ తరగతుల్లో వారు పాల్గొని మాట్లాడారు. ఆదర్శ పంచాయతీలకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను అందజేస్తుందని తెలిపారు. గ్రామాల్లో ప్రధానంగా తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీలు, పారిశుద్ధ్యం, విద్యుద్దీపాలతోపాటు వైకుంఠథామాలు, హరితహారంపై దృష్టి సారించాలన్నారు. మంచి పాలన అందించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. కార్యక్రమంలో భువనగిరి డీఎల్‌పీఓ, ట్రైనింగ్‌ కోఆర్డినేటర్లు బి. శ్రీకాంత్‌రెడ్డి, రాములు, టీఓటీలు భాస్కర్‌, నవీన్‌కుమార్‌, మాజిద్‌, దినకర్‌, వెంకటేశ్వర్లు, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ జెడ్పీ సీఈఓ శోభారాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement