రోడ్డు ప్రమాదాలను నివారించండి
జంతువులను షెల్టర్‌కు తరలించాలి
సాక్షి,యాదాద్రి : రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను రక్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో జిల్లాలో రోడ్డు భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధాన రహదారులపై స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసి, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల బస్సులు కండీషన్‌లో ఉన్నాయా లేదా అని తనిఖీ చేయాలని సూచించారు. ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ.. జిల్లాలో బ్లాక్ స్పాట్లను గుర్తించి తగు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తామని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ అధికారి సరిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డ్రగ్స్ నివారణ చర్యలు తీసుకోవాలి
సాక్షి,యాదాద్రి : జిల్లాలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్‌తో కలిసి శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూతబడిన కంపెనీల్లో డ్రగ్స్ తయారీ, సరఫరా చేస్తున్నారా అని తనిఖీ చేయాలని సూచించారు. మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. నూతన సర్పంచ్‌లకు, మున్సిపాలిటీల పాలక వర్గాలకు మత్తుపదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
భువనగిరిటౌన్ : రోడ్లపై తిరిగే ఆవులు, కుక్కలు, ఇతర జంతువులను గుర్తించి వాటిని ఒక షెల్టర్‌కు తరలించాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్లపై సంచరించి జంతువుల నియంత్రణపై శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జంతువుల కోసం ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసి వాటికి స్టెరిలైజేషన్ చేయాలన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


