రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
యాదగిరిగుట్ట: రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలువలేక డబ్బులు, బెదిరింపులకు పాల్పడి మున్సిపల్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ లాగేసుకుందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓట్లతో గెలిచిన కౌన్సిలర్లను డబ్బులకు కొనుగోలు చేస్తున్న చరిత్ర రేవంత్‌రెడ్డిదే అని మండిపడ్డారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, విజయ్ తదితరులు ఉన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత


