నేడు కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం
కోదాడ : మూడు నెలల క్రితం మృతిచెందిన రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ మృతదేహానికి శుక్రవారం కోదాడలో రీ పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ తెలిపారు. గురువారం కోదాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీబీనగర్ ఎయిమ్స్‌కు చెందిన వైద్య బృందంచే రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మూడు నెలలుగా చేస్తున్న పోరాటం వల్లే ప్రభుత్వం దిగి వచ్చి రీ పోస్టుమార్టానికి అంగీకరించిందని, దీని వల్ల రాజేష్ కుటుంబానికి తగిన న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏపూరి రాజు పాల్గొన్నారు.


