ప్రేమ వివాహం ఇష్టంలేక.. | - | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం ఇష్టంలేక..

Feb 27 2026 4:03 AM | Updated on Feb 27 2026 4:03 AM

ప్రేమ వివాహం ఇష్టంలేక..

ప్రేమ వివాహం ఇష్టంలేక..

బొమ్మలరామారం : ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్న యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ బుగ్గ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. రామలింగంపల్లి గ్రామానికి చెందిన యువతి, హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్‌ ప్రాంతానికి సాటల అజయ్‌కుమార్‌ మూడురోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. యువతి కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేకపోవడంతో ఆమెకు సర్దిచెప్పి మంగళవారం రామలింగంపల్లి గ్రామానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఎలాగైనా అజయ్‌కుమార్‌ను హత్య చేయాలని పథకం రచించారు. యువతి కుటుంబ సభ్యులు బుధవారం తెల్లవారుజామున అజయ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి మాట్లాడుదామని చెప్పి రామలింగంపల్లి గ్రామ శివారులోకి పిలిపించారు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులైన గ్యార దయాకర్‌, కట్టా నర్సింగ్‌రావు, రంగాపురం మహేందర్‌, ఉబ్బపెల్లి వేణు, కొమ్ము సాయికిరణ్‌ అలియాస్‌ చంటి, కొమ్ము నర్సింగ్‌రావు, మరో బాలుడు కలిసి అజయ్‌కుమార్‌ కళ్లలో కారం చల్లి ఛాతి, మొహం, వీపు, పక్కటెముకలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అజయ్‌కుమార్‌ అక్కడే స్పృహతప్పి పడిపోగా.. అతడు మృతిచెందాడనుకుని నిందితులు పారిపోయారు. అజయ్‌కుమార్‌ శరీరంపై 14 చోట్ల కత్తిపోట్లు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అజయ్‌కుమార్‌ను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ హత్యాయత్నంలో పాలుపంచుకున్న 8 మందిని గురువారం అరెస్ట్‌ చేసి కోర్టుకు రిమాండ్‌ చేశామని ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు.

ఫ యువకుడిపై కత్తితో దాడి చేసిన యువతి కుటుంబ సభ్యులు

ఫ శరీరంపై 14 చోట్ల కత్తిపోట్లు

ఫ ఆస్పత్రిలో చికిత్స

పొందుతున్న యువకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement