వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు

Feb 23 2026 8:55 AM | Updated on Feb 23 2026 8:55 AM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు

భూదాన్‌పోచంపల్లి : మండలంలోని జలాల్‌పురం గ్రామ సమీపంలో ఆది వారం వేగంగా వెళ్తు న్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు చెందిన మనోహర్‌ పోచంపల్లి పట్టణంలోని ప్రకాశ్‌నగర్‌లో ఇటీవల ఇల్లు కొనుగోలు చేశాడు. ఆదివారం ఇంట్లో మనోహర్‌ ఉప్పలమ్మ పండగ చేయగా.. హైదరాబాద్‌ నుంచి బంధువులు, మిత్రులు వచ్చారు. తిరిగి సాయంత్రం కొందరు బంధువులు కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా.. జలాల్‌పురం గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకులను వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. కాగా క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు.

కారు ఢీకొని..

మునగాల: మండలంలోని మాధవరం గ్రామ శివారులో నేలమర్రి రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నేలమర్రి గ్రామానికి చెందిన నాగయ్య, శ్రీను ద్విచక్ర వాహనంపై మాధవరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా.. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనానని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారును అక్కడే వదలి డ్రైవర్‌ పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది స్టాలిన్‌, నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement