యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ

Mar 2 2026 8:59 AM | Updated on Mar 2 2026 8:59 AM

యాదగి

యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్‌, ప్రసాద విక్రయశాల, మాడ వీధులు, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. స్వామివారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామిని 40వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజల ద్వారా నిత్యాదాయం రూ.42,96,548 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.

యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ1
1/1

యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement