నిబంధనలు ఉల్లంఘిస్తే తాళం వేస్తాం | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘిస్తే తాళం వేస్తాం

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

నిబంధనలు ఉల్లంఘిస్తే తాళం వేస్తాం

నిబంధనలు ఉల్లంఘిస్తే తాళం వేస్తాం

భూదాన్‌పోచంపల్లి: నిబంధనలు ఉల్లంఘించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే రసాయన కంపెనీలకు తాళం వేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెంలోని వీజెసాయి కెమికల్‌ కంపనీలో నాలుగు రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో ఉద్యోగి సజీవ దహనం అయిన నేపథ్యంలో ఘటనా స్థలాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, బాఽధిత కుటుంబానికి పరిహారం ఇచ్చి ఆదుకొన్నారా లేదా అని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్ని చిన్న కంపెనీలు నిబంధనలు పాటించకపోవడంతో కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. కాలుష్యం ఒకవైపు కంపనీల్లో వరుస పేలుళ్ల ఘటనలు మరో వైపు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మధుసూధన్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, చౌటుప్పల్‌ రూరల్‌ సీఐ రాములు, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ యాట జంగయ్య, ఉపసర్పంచ్‌ బద్దం వెంకట్‌రెడ్డి, పాక మల్లేశ్‌, తడక వెంకటేశ్వర్లు, లవకుమార్‌, సామ మధు పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement