చిలుకూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి దేశబోయిన కాశయ్య(43) రెండు రోజుల క్రితం పని నిమిత్తం నేరేడుచర్లకు వెళ్లాడు. అతడు నేరేడుచర్ల పట్టణంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి బొలేరో వాహనం వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాశయ్యను స్థానికులు చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా చిక్సిత పొందుతూ శనివారం మృతిచెందాడు.


