ఆర్‌యూబీ పనుల జాప్యంపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఆర్‌యూబీ పనుల జాప్యంపై ఆందోళన

Feb 27 2026 4:05 AM | Updated on Feb 27 2026 4:05 AM

ఆర్‌యూబీ పనుల జాప్యంపై ఆందోళన

ఆర్‌యూబీ పనుల జాప్యంపై ఆందోళన

ఆలేరు: ఆలేరులో రైల్వేఅండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ) పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ గురువారం స్థానిక రైల్వేగేట్‌ సమీపంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రమాణస్వీకారం అనంతరం పట్టణ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కోమల్ల మౌనికాహరీష్‌, కళ్యాణిమధు, యాటశివకుమార్‌లతోపాటు బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా కౌన్సిలర్లు, నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వంద రోజుల్లో కుర్చీ వేసుకొని ఆర్‌యూబీ పనులను పూర్తి చేయిస్తానని బీర్ల ఐలయ్య హామీ ఇచ్చి రెండేళ్లు అవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు.ఆర్‌యూబీ పనులు పూర్తి కాకపోవడానికి ఎమ్మెల్యే నిర్లక్ష్యమే కారణమన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి హయాంలో ఆర్‌యూబీ పనులు 70శాతం పూర్తయినా, మిగతా పనులు పూర్తి చేయించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్‌గౌడ్‌, మాజీ చైర్మన్‌వస్పరి శంకరయ్య, మాజీ వైస్‌ చైర్‌పర్సన్‌ మొరిగాడి మాధవి, కొలుపుల హరినాథ్‌,బొట్ల పరమేశ్వర్‌,మొరిగాడివెంకటేష్‌,మాదాని ఫిలిప్‌,బేతి రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement