భువనగిరి మున్సిపాలిటీలో సేకరించిన చెత్తలో అధికంగా ప్లాస
నిత్యం 20 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ
అవగాహన కల్పిస్తాం
భువనగిరి: భువనగిరి పట్టణంలో ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయింది. ఇక్కడ నిషేధం జాగ కన్పించడంలేదు. పట్టణంలోని వివిధకాలనీల నుంచి మున్సిపల్ సిబ్బంది సేకరించిన చెత్తలో ముప్పావంతూ ప్లాస్టికే ఉంటోంది. కేవలం 25శాతం మాత్రమే చెత్త, వ్యర్థాలు ఉంటున్నాయి. ఇందులో మట్టి పొడి వ్యర్థాలు 15శాతం వస్తే మరో పది శాతం సీసాలు, మట్టి, గృహవస్తువులు ఉంటున్నాయి. దీంతో బయోమైనింగ్‌కు ప్రక్రియకు అడ్డంకిగా మారింది.
పెరిగిన ప్లాస్టిక్ కవర్ల వినియోగం
భువనగిరి మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులున్నాయి. వీటి పరిధిలో సుమారు 15వేలకు పైగా గృహాలు, సుమారు 70వేలకు పైగా జనాభా ఉంది. వీరితో పాటు భువనగిరి పట్టణం జిల్లా కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల ప్రజలు పట్టణానికి వచ్చి కూరగాయలు, గృహ అవసరాలకు అవసరమైన సామగ్రిని ప్లాస్టిక్ సంచుల్లోనే తీసుకెళ్లుంటారు. ఇందులో పట్టణ ప్రజలు సైతం ఇంటికీ ప్రతి వస్తువునును ప్లాస్టిక్ కవర్లలోనే తీసుకెళ్తున్నారు. దీంతో కిరణం, కూరగాయల దుకాణాల్లో ప్లాస్టిక్ వాడకం వివరీతంగా పెరిగింది. ఈ కారణంగా మున్సిపల్ సిబ్బందికి ఇచ్చే చెత్తలో ఎక్కువగా ప్లాస్టిక్ ఉంటోంది.
ఫ నిత్యం 20మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ
ఫ అమలుకు నోచని ప్లాస్టిక్ నిషేధం
ఫ బయోమైనింగ్‌కు అడ్డంకి
భువనగిరి
మున్సిపాలిటీలో..
మొత్తం వార్డులు 35
గృహాలు : 15,000
జనాభా: 70,000
భువనగిరి పట్టణంలో తడిచెత్త, పొడి చెత్త పేరుతో నిత్యం సేకరించిన చెత్తను మున్సిపాలిటీ డపింగ్ యార్డులో నిల్వ చేస్తున్నారు. నిత్యం 20 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇందులో తడి చెత్త 12, పొడి చెత్త 8, మిశ్రమ చెత్త 2 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. అయితే ప్రజలు తమ అవసరాల కోసం ప్లాస్టిక్ కవర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో సేకరించిన చెత్తలో ప్లాస్టిక్ కవర్లే ఎక్కువగా ఉంటున్నాయి. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం ఉన్నప్పటికీ సరిగా అమలు కాకపోవడంతో పాటు వాడకం పెరగటం వల్ల పర్యావణానికి ముంప్పుమారే అవకాశం లేకపోలేదు.
ప్లాస్టిక్ పై పట్టణప్రజలకు , వ్యాపారస్తులకు అవగాహన కల్పిస్తాం. అనంతరం వాడుతున్న వారి దుకాణాలు, వ్యాపార సముదాయాల పై దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తాం. ప్లాస్టిక్ నిషేధం విడతల వారీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– రాంలింగం, మున్సిపల్ కమిషనర్, భువనగిరి
భువనగిరి మున్సిపాలిటీలో సేకరించిన చెత్తలో అధికంగా ప్లాస


