నూతన కలెక్టర్‌గా అనురాగ్ జయంతి బాధ్యతలు
సాక్షి,యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా అనురాగ్ జయంతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కలెక్టర్ హనుమంతరావు దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హనుమంతరావు గురువారం రిలీవ్ అయ్యారు. అనురాగ్ జయంతి 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో నిజామాబాద్ జిల్లా బోధన్, ఖమ్మం జిల్లాలో సబ్ కలెక్టర్‌గా, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న అనురాగ్ జయంతిని కలెక్టర్ గా నియమించింది.
ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యం
కొత్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యముంటుందన్నారు. విద్యా, వై ద్య రంగాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అ ట్టడుగు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటానన్నా రు. జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపడతానన్నారు.
దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బదిలీ
కలెక్టర్ హనుమంతరావు దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. దీంతోపాటు గోదావరి పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ గా సైతం అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు.
అదనపు కలెక్టర్ స్వాగతం
కలెక్టర్ అనురాగ్ జయంతికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు స్వాగతం పలికారు. ఆయనకు పూల బొకే ఇచ్చి సత్కరించారు.
ఫ దేవాదాయశాఖ డైరెక్టర్‌గా హనుమంతరావు బదిలీ


