హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసుకుందాం
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీని సమష్టి కృషితో హైదరాబాద్ నగరం తరహాలో అభివృద్ధి చేసుకుందామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లుతో పాటు కౌన్సిలర్ల పదవీ బాధ్యతల స్వీకరణ వేడుకల్లో వారు మాట్లాడారు. ఎన్నికల ఘట్టం ముగిసినందున పార్టీలకతీతంగా పట్టణ అభివృద్ధిపై శ్రద్ధ చూపాలన్నారు. ఇప్పటికే రూ.65 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. రహదారుల, చౌరస్తాల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ప్రజాపాలన అందించాలని సూచించారు. 35 వార్డులకుగాను కాంగ్రెస్ పార్టీ 22 వార్డుల్లో విజయం సాధించి వివాదాలకు తావు లేకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారని తెలిపారు. విపక్ష వార్డులను కూడా స్వపక్ష వార్డులుగానే పరిగణిస్తూ అన్ని వార్డుల అభివృద్ధికి కాంగ్రెస్ పాలకపక్షం ప్రాధాన్యమివ్వాలన్నారు. నూతన చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే మార్గదర్శకంలో పట్టణాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లను పలువురు ఘనంగా సత్కరించారు. కమిషనర్ జి. రామలింగం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి. అవేజ్ చిస్తి, కిర్తీరెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంపీ చామల, ఎమ్మెల్యే కుంభం
ఫ భువనగిరి చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ బాధ్యతల స్వీకరణ


