బాల ఆకాష్ కుటుంబానికి అండగా ఉంటాం
నకిరేకల్ : ప్రభుత్వ నిర్లక్షంతో మృతి చెందిన విద్యార్థి బాల ఆకాష్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన బంధనాథం బాలఆకాష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాలఆకాష్ భువనగిరి శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 15న పాఠశాల సమీపంలోని ఫాంపాండ్‌లో స్నానం చేసేందుకు వెళ్లి ఈత రాక మృతిచెందాడు. విద్యార్థి మృతిపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేటీఆర్‌కు సమాచారం ఇవ్వడంతో.. గురువారం రాత్రి కేటీఆర్ రాయపురం చేరుకుని బాలఆకాష్ చిత్రపటం వద్ద పూలుచల్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. అక్కడ నుంచే సంబంధిత మైనారిటీ గురుకుల పాఠశాల సెక్రటరీకి ఫోన్ చేసి మాట్లాడారు. బాలుడి మృతికి బాధ్యులైన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని సూచించారు. బాలఆకాష్ తండ్రి అంథోనిరాజుకు ఉద్యోగం ఇప్పించాలని కోరారు. బాలుడి సోదరి మధువన్సీతను అక్కున చేర్చుకుని.. ‘నేను నీకు అన్న అనుకో.. లేక బాబాయి అనుకో నువ్వ ఎంత వరకు చదివితే అంత వరకు నీ ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులన్నీ నేనే భరిస్తా’ అని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నాయకులు దూదిమెట్ల బాలరాజు యాదవ్, డాక్టర్ చెరుకు సుదాకర్, ప్రవీణ్‌కుమార్, నలగాటి ప్రసన్నరాజ్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, కొప్పుల ప్రదీప్‌రెడ్డి, మారం వెంకట్‌రెడ్డి, ప్రగడపు నవీన్‌రావు, రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, బడుగుల శ్రీనివాస్ ఉన్నారు.
ఫ మాజీ మంత్రి కేటీఆర్


