యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఆదివారం రాత్రి పోలీసులు గంజాయి పట్టుకున్నారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపురం గ్రామంలోని పీర్ల గుట్ట, ప్రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో కొంతమంది వ్యక్తులు ఆదివారం రాత్రి గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులను చూసి గంజాయిని సేవిస్తున్న వ్యక్తులు గంజాయి ప్యాకెట్లు, బైక్‌లను అక్కడే వదిలి పారిపోయారు. 60 గ్రాముల గంజాయి, రెండు బైక్‌లను ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి తెలిపారు. పారిపోయిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.


