● కోదాడ నియోజకవర్గ పరిధిలో 162 మందిని
గుర్తించిన సైబర్ క్రైం పోలీసులు
● 30 మందిని అదుపులోకి తీసుకుని బ్యాంక్ అకౌంట్‌లు సీజ్
● రిమాండ్‌కు తరలింపు
చిలుకూరు : ఆన్‌లైన్‌లో గేమ్‌ల పేరిట లక్షల రూపాయాలు చెలామణి చేస్తున్న పలువురు సైబర్ నేరగాళ్లను సోమవారం సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కోదాడ, హుజూర్‌నగర్ నియోజవకర్గ పరిధిలో సుమారు 162 మంది ఉన్నట్లు గుర్తించిన సైబర్ క్రైం పోలీసులు వారిలో 30 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కోదాడ నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు, తెల్లబెల్లి, పాలారం, లక్ష్మీపురం, వల్లాపురం, ఆకుపాముల తదితర గ్రామాల నుంచి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారి బ్యాంక్ అకౌంట్‌లను సీజ్ చేయడంతో పాటు రిమాండ్‌కు కూడా పంపినట్లు సమాచారం. అయితే తమ వాళ్లను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరు లక్షల రూపాయాలు చెలామణి చేసినట్లు పోలీసులు గుర్తించారని, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి సెల్‌ఫోన్లు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. స్థానిక పోలీసుల కూడా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. వీరిలో చాలా మంది అధికార పార్టీ నాయకులు ఉన్నట్లుగా తెలిసింది.


