కొండమల్లేపల్లి : తన పేరిట ఉన్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన బొమ్ము వెంకటయ్య(49) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం చింతచెట్టుతండా గ్రామ పంచాయతీ పరిధిలో పూల్‌సింగ్‌తండాకు చెందిన నేనావత్ శ్రీనుకు మూడు గుంటల భూమిని వెంకటయ్య విక్రయించాడు. తన పేరిట ఉన్న మరో 17 గుంటల భూమిని కూడా శ్రీను, మరో నలుగురు కలిసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ భూమిని తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని కోరితే బెదిరిస్తున్నారని, దీంతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని వెంకటయ్య ఓ పేపర్‌లో రాసి సోమవారం తన ఇంటి సమీపంలో పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమార్తె శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మనస్తాపంతో బలన్మరణం


