కేతేపల్లి : కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన బాలికకు బాల్య వివాహం చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసు అధికా రులు సోమవారం బాలిక ఇంటికి వెళ్లారు. అక్కడ పెళ్లి పనులు జరుగుతుండటంతో అధికా రులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చా రు. బాల్య వివాహం చేయడం నేరమని, అవగాహన కల్పించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు అంగీకరించి రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన వారిలో తహసీల్దార్ రమాదేవి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కళావతి, అశ్రిత, లక్ష్మణ్, శోభారాణి ఉన్నారు.
సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
నకిరేకల్ : నకిరేకల్ పట్ట ణంలో ఆదివారం రాత్రి సంతకు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అక్కడే డ్యూటీలో ఉన్న నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సుధాకర్ యువకుల సహాయంతో సదరు వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. అనంతరం ప్రైవేట్ వాహనంలో నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
షార్ట్ సర్క్యూట్‌తో పాన్‌షాపు దగ్ధం
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజేత పాన్‌షాపులో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగామంటలు, పొగ రావడంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలా నికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. అప్పటికే పాన్‌షాపులోని సామాను కాలిబూడిదైంది. సుమారు రూ.5 లక్షల విలువైన సామగ్రి, ఫర్నీచర్, రూ.35వేల నగదు దగ్ధమైనట్లు షాపు యజమాని తెలిపాడు.


