న్యాయం చేయాలని బాధితుల ఆందోళన
చిట్యాల : మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు(శివనేనిగూడెం)కు చెందిన ఓ వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్య చికిత్స పొందుతోంది. ప్రమాదానికి కారణమైన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ చిట్యాల పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మంగళవారం చిట్యాల పోలీస్‌స్టేషన్ ఎదుట బాధితురాలి బంధువులు రాస్తారోకో చేస్తూ ఆందోళనకు దిగారు. ఏఎస్‌ఐ వెంకటయ్య ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో నిరసన తెలుపుతున్న వారు ఆందోళన విరమించారు. ఈ రాస్తారోకోతో కాసేపు ట్రాఫిక్ జాం ఏర్పడింది.


