పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ అధికారులు
స్వామివారికి టీటీడీ తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. మంగళవారం రాత్రి టీటీడీ నుంచి ఏఈఓ రత్నం ఆధ్వర్యంలో అధికారులు యాదగిరిగుట్టకు వచ్చారు. స్వయంభూలను దర్శించుకుని ముఖ మండపంలో ఈఓ భవానీ శంకర్‌కు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అదేవిధంగా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన చేనేత కళాకారులు గజం నర్మద, నరేంద్ర రెండు ఇక్కత్ కంచిపట్టు చీరలు, పట్టు పంచె, మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన చాట్లా ప్యాట్నీ సెంటర్ నిర్వాహకులు 8 పట్టుచీరలు, 5 పట్టు పంచెలు అందజేశారు.


