జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
ఆత్మకూరు(ఎం) : హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇటీవల నిర్వహించిన 4వ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో భాగంగా జూడో మరియు రెజ్లింగ్ పోటీల్లో ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేటకు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు కమ్మంపాటి మహేందర్, బి. రాజశేఖర్, కమ్మంపాటి ప్రశాంత్ పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని 3వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కమ్మంపాటి మహేందర్ జూడో 66 కేజీల విభాగంలో ద్వితీయ బహుమతి, రెజ్లింగ్ 67 కేజీల విభాగంలో కాంస్య పతకం, వుషూలో ద్వితీయ బహుమతి సాధించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బి. రాజశేఖర్ జూడో 90 కేజీల విభాగంలో బంగారు పతథకం గెలుచుకున్నారు. గుండాల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కమ్మంపాటి ప్రశాంత్ జూడో 73 కేజీల విభాగంలో ద్వితీయ బహుమతి, రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించారు. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రశాంత్, రాజశేఖర్, మహేందర్‌ను కోచ్ కమ్మంపాటి సోమరాజు, గ్రామస్తులు అభినందించారు.


