విశ్వశాంతి కేంద్రంగా బుద్ధవనం | - | Sakshi
Sakshi News home page

విశ్వశాంతి కేంద్రంగా బుద్ధవనం

Mar 3 2026 9:36 AM | Updated on Mar 3 2026 9:36 AM

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

సాగర్‌లో ముగిసిన 3వ దమ్మయాత్ర

నాగార్జునసాగర్‌ : సాగర్‌లోని బుద్ధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో నిర్వహించిన 3వ బుద్ధ దమ్మ యాత్ర ముగింపు వేడుకలకు మంత్రి వెంకటస్వామితో కలిసి ఆయన హాజరయ్యారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రం కల్బుర్గిలోని సిద్ధార్థ విహార్‌ నుంచి ప్రారంభమైన దమ్మ పాదయాత్ర శాంతి సందేశాన్ని చాటుతూ నాగార్జునసాగర్‌కు చేరుకోవడం సంతోషదాయకమ న్నారు.రాష్ట్రంలోని ఫణిగిరి, నేలకొండపల్లి, దూలికట్ట వంటి చారిత్రక బౌద్ధక్షేత్రాలను అనుసంధానిస్తూ పర్యాటక సర్క్యూట్‌ ఏర్పాటును వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఒక ‘డిజిటల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ మనిషి సాధారణ జీవితం గడిపేందుకు బుద్ధుడి బోధనలు మార్గదర్శకంఅని అన్నారు. కార్యక్రమంలో సాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, కలెక్టర్‌ చంద్రశేఖర్‌, సబ్‌కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌, పర్యాటక శాఖ మాజీ ఎండీ ఆంజనేయరెడ్డి, గగన్‌మాలిక్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు గగన్‌మాలిక్‌, అక్షయ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హిట్టంబె, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement