‘ఓపెన్’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
హుజూర్‌నగర్ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ధర్మానాయక్ అన్నారు. శనివారం హుజూర్‌నగర్‌లోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష కేంద్రాన్ని ఆయన, యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ యాదగిరి కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధర్మానాయక్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనం త్వరలో నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివి గ్రూప్–1, 2 ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రామారావుతో పాటు కోఆర్డినేటర్ బాలరాజు, జాక్టో సైదానాయక్ తదితరులు ఉన్నారు.
ఫ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ధర్మానాయక్


