రెండో పీఆర్సీ అమలు చేయాలి
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదేళ్లు అవుతున్నా రెండో పీఆర్సీ అమలు చేయకపోవడం సరికాదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. సోమయ్య అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే నివేదికను తెప్పించుకుని 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, ఐదు విడతల పెండింగ్ డీఏలను ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పి. శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ఆర్. దామోదర్, ఎన్. నాగేశ్వరరావు, బి. ఆడం, వి. రమేష్, ఎస్. సోమయ్య, సీహెచ్. రమేష్, డి. లాలు తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమయ్య


