భవంతిని తలపించేలా..
చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట శివారులో 200 ఏళ్ల క్రితం నిర్మించిన మెట్ల బావి ఉంది. అయితే ఈ బావిని ఎవరు నిర్మాణం చేశారన్న విషయంలో స్పష్టత లేదు. ఈ బావి అసఫ్‌జాహీల కాలానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. దీనిని 40 అడుగుల వెడల్పు, 80 అడుగుల పొడవు, 60 అడుగుల లోతులో పూర్తిగా రాళ్లతో నిర్మించారు. 30 అడుగుల దిగువన బావిలో మూడు అంతస్తుల్లో 12 గదులు ఏర్పాటు చేశారు. సాగు, తాగునీటితో పాటు స్నానాలు చేసేందుకు అనువుగా ఈ బావిని నిర్మించినట్లు తెలుస్తోంది. బావి చుట్టూ నడిచేందుకు, విశ్రాంతి గదుల వైపు వెళ్లేలా లోపలి భాగంలో రెండు అంతస్తుల్లో అరుగులు నిర్మించారు. బావి ఉత్తర భాగంలో మెట్లు ఏర్పాటు చేశారు. బావిలోని మూడో అంతస్తు పైన నీటిని తోడేందుకు ప్రత్యేక అర ఉంది.
భవంతిని తలపించేలా..


