నాటి వైభవాన్ని కమ్మేశాయి
రాజాపేట : రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో కాకతీయుల కాలంలో శివాలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో మెట్ల బావి (కోనేరు) నిర్మించారు. బావి పైభాగంలో గ్రామంలో ఊర చెరువు నిర్మించారు. ఈ ఊర చెరువులో నీరు ఉన్నంతకాలం మెట్ల బావిలో సమృద్ధిగా నీరు లభిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మెట్ల బావి శిథిలావస్థకు చేరి పిచ్చి మొక్కలతో నిండి కనిపించకుండా పోయింది. శివాలయాన్ని ఆధునీకరణ చేసే క్రమంలో మెట్ల బావిలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి తిరిగి పిచ్చి మొక్కలు పెరిగి కోనేరు కనిపించకుండా శిథిలావస్థకు చేరింది. అధికారులు స్పందించి మెట్ల బావిని వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.


