రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

Feb 22 2026 6:54 AM | Updated on Feb 22 2026 6:54 AM

రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

తిరుమలగిరి (తుంగతుర్తి): రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. లాక్యతండాకు చెందిన గుగులోత్‌ నెహ్రూ(30) బైక్‌పై వెళ్తుండగా.. వెలిశాల గ్రామంలోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నెహ్రూ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య సుజాత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయస్థాయి

కబడ్డీ పోటీలకు ఎంపిక

నడిగూడెం : మండల పరిధిలోని బృందావనపురం గ్రామానికి చెందిన కాసాని సాయి జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు మండల కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు పేరెల్లి కోటి, కార్యదర్శి కరుణాకర్‌ శనివారం తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన కాసాని సాయి చిన్నప్పటి నుంచి కబడ్డీలో రాణిస్తూ జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు వారు పేర్కొన్నారు. సాయి జాతీయస్థాయికి ఎంపిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement