ప్రజల దాహార్తిని తీర్చిన పీర్ల బావి | - | Sakshi
Sakshi News home page

ప్రజల దాహార్తిని తీర్చిన పీర్ల బావి

Feb 22 2026 6:54 AM | Updated on Feb 22 2026 6:54 AM

ప్రజల

ప్రజల దాహార్తిని తీర్చిన పీర్ల బావి

ప్రజల దాహార్తిని తీర్చిన పీర్ల బావి

దేవరకొండ: పట్టణంలోని సంజయ్‌కాలనీలో గల పీర్ల బావిని రేచర్ల వెలమ రాజుల కాలంలో నిర్మించారు. ఒకప్పుడు పట్టణంలోని చాలా కాలనీల ప్రజలు ఈ బావి నీటినే తాగేవారు. బావిలోకి దిగేందుకు బండరాళ్లతో మెట్లు నిర్మించారు. ఈ బావి నుంచి దేవరకొండ ఖిలాకు సొరంగ మార్గం ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. బావిలోకి చెలిమె ద్వారా వచ్చే నీటికి ఎంతో రుచి ఉండేదని, దీంతో చుట్టుపక్కల కాలనీల ప్రజలు ఈ నీటిని తీసుకెళ్లేవారు. ప్రస్తుతం ఈ బావి నీటి వాడకం తగ్గింది. కానీ ఇప్పటికీ కొందరు తమ ఇంటి అవసరాలకు మోటార్ల ద్వారా ఈ బావి నీటిని వినియోగిస్తున్నారు. ఈ బావి చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఈ బావిని పునరుద్ధరించి గత వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రజల దాహార్తిని తీర్చిన పీర్ల బావి 1
1/1

ప్రజల దాహార్తిని తీర్చిన పీర్ల బావి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement