రాచకొండకే తలమానికం
సంస్థాన్ నారాయణపురం : 400 ఏళ్ల క్రితం రాచకొండను ఎలిన సింగభూపాలుడు రాచకొండ ప్రాంతంలో మూడు మెట్ల బావులు నిర్మించారు. అందులో ఒకటి పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. మరో బావి అటవీ ప్రాంతంలో ఉంది. హజ్రత్ గాలిబ్ షాహిద్ దర్గా ప్రాంతంలో ఉన్న మెట్ల బావి 90శాతం మేర బాగుంది. 2024 కంటే ముంది ఈ బావి కూడా పూర్తిగా పూడుకుపోయింది. బావి చుట్టూ ముళ్ల పొదలు, భూమి పైన ఉన్న రాతి కట్టడం ధ్వంసమైంది. దీంతో అప్పటి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ బావి అభివృద్ధి కోసం రూ.30లక్షలు మంజూరు చేశారు. మెట్ల బావిలో పూడిక తీసి, బావి లోపల రాతి కట్టడాల మధ్య సిమెంట్ పనులు చేయించారు. ఈ పనులు పూర్తికావాల్సిన సమయంలో కలెక్టర్ పమేలా సత్పతి బదిలీపై వెళ్లడంతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. వానాకాలంలో వర్షాలకు మెట్లబావిలోకి నీరు చేరింది. ప్రస్తుతం బావిలో సగం వరకు నీళ్లు ఉన్నాయి. బావి చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయింది.
రాచకొండకే తలమానికం


