బొమ్మలరామారం: ప్రజల జీవితాలు హరివిల్లుగా మారాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బొమ్మలరామారం మండలంలోని గోవింద్ తండాలో బుధవారం నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి రంగులు చల్లుతూ ,సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయన్నారు. గిరిజనుల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్‌లు, పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


