కాలుష్యం కోరల్లో రంగాపూర్‌ | - | Sakshi
Sakshi News home page

కాలుష్యం కోరల్లో రంగాపూర్‌

Mar 2 2026 8:57 AM | Updated on Mar 2 2026 8:57 AM

కాలుష

కాలుష్యం కోరల్లో రంగాపూర్‌

పీసీబీ అధికారులకు లేఖ రాశాం ఊపిరి తీసుకోలేక పోతున్నాం

రంగాపూర్‌ గ్రామ సమీ పంలో కాలుష్యం వెదజల్లుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్న టైర్ల కంపనీపై తదుపరి చర్యల నిమిత్తం జిల్లా పోల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (పీసీబీ)అధికారులకు లేఖ రాశాం. నిబంధనలు పాటించని, ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఫ్యాక్టరీలపై చర్యలు తప్పనిసరిగా తీసుకునేలా జిల్లా అధికారులకు నివేదిక అందజేశాం.

– రాజాత్రివిక్రమ్‌,

ఎంపీడీఓ బొమ్మలరామారం

రంగాపూర్‌ సమీపంలోని టైర్ల రీసైక్లింగ్‌ కంపెనీ రాత్రి వేళల్లో తీవ్రమైన దుర్వాసనతో కూడిన పొగ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. దీంతో రాత్రి సమయంలో ఊపిరి తీసుకోలేక పోతున్నాం. చాలా కష్టంగా ఉంది. ఈ పొగతో సమీపంలోని కూరగాయల పంటలపై నల్లటి బొగ్గులాంటి పదార్థం పేరుకుపోతోంది. ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలి.

– జూపల్లి లింగం, బొమ్మలరామారం

విషం చిమ్ముతున్న

టైర్ల రీసైక్లింగ్‌ కంపెనీ

అనారోగ్యం బారిన గ్రామస్తులు

కూరగాలయ పంటలపైనా ప్రభావం

పట్టించుకోని కాలుష్య

నియంత్రణ మండలి

సమస్యను పరిష్కరించాలని

కలెక్టర్‌కు విన్నపం

బొమ్మలరామారం : ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కాలుష్య కారక కంపెనీపై చర్యలు తీసుకోవడంలో కాలుష్య నియంత్రణ (పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు–పీసీబీ) అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. బొమ్మలరామారం మండలం రంగాపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న టైర్ల రీసైక్లింగ్‌ కంపెనీ రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా తీవ్ర దుర్వాసనతో కూడిన పొగ కాలుష్యాన్ని వదులుతోంది. దీంతో కళ్లు మండుతున్నాయని, ఊపిరి పీల్చుకోలేక శ్వాస సంబంధిత సమస్యతోపాటు గుండె, ఊపిరితిత్తులు పాడవడం, జలుబు, ఎలర్జీ లాంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని, కూరగాయల పంటలపై కూడా ప్రభావం చూపుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగాపూర్‌ గ్రామస్తులు ఈనెల 23న ప్రజావాణిలో కలెక్టర్‌ హనుమంతరావును కలిసి తమ సమస్యను వివరించారు. ఈ కంపెనీని మూసేయాలని గతంలో చాలాసార్లు అఖిల పక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రం ఆందోళలు చేసి అధికారులకు వినతులు అందజేశామని, అయినా కాలుష్య నియంత్రణ అధికారులు చర్యలు తీసుకోగా పోగా అటువైపు కన్నెత్తికూడా చూడడం లేదని విన్నవించారు. ఇప్పటికై నా సదరు కంపెనీపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు అఖిల పక్షం ఆధ్వర్యంలో గ్రామస్తులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

నిబంధనలకు నీళ్లు!

రంగాపూర్‌ సమీపంలోని టైర్ల రీసైక్లింగ్‌ కంపెనీ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి విచ్చలవిడిగా కాలుష్యాన్ని జనావాసాల్లోకి వదులుతున్నాయనేది బహిరంగ సత్యం. ఈ కంపెనీని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకు నెలకొల్పినప్పటికీ జనావాసాలకు సమీపంలో ఏర్పాటు చేయడమేంటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజారోగ్యంతోపాటు వివిధ రకాల పంటలు, కూరగాలయ తోటలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సదరు కంపెనీ ఉత్పత్తులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, ప్రజారోగ్యానికి ముప్పులా దాపురించిన ఈ కంపెనీని మూసివేయాలని బాధిత గ్రామ ప్రజల డిమాండ్‌ చేస్తున్నారు.

సాయంత్రం వేళలో కంపెనీ నుంచి కొద్దిపాటిగా విడుదలవుతున్న పొగ

రంగాపూర్‌ సమీపంలోని టైర్ల రీసైక్లింగ్‌ కంపెనీ లోపలి భాగం

కాలుష్యం కోరల్లో రంగాపూర్‌ 1
1/4

కాలుష్యం కోరల్లో రంగాపూర్‌

కాలుష్యం కోరల్లో రంగాపూర్‌ 2
2/4

కాలుష్యం కోరల్లో రంగాపూర్‌

కాలుష్యం కోరల్లో రంగాపూర్‌ 3
3/4

కాలుష్యం కోరల్లో రంగాపూర్‌

కాలుష్యం కోరల్లో రంగాపూర్‌ 4
4/4

కాలుష్యం కోరల్లో రంగాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement