ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు మృతి
ఫ మరొకరికి గాయాలు
మేళ్లచెరువు : బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. దొండపాడు గ్రామానికి చెందిన తిరుమల భానుసాయి(18), నన్నెపంగు కిరణ్ బైక్‌పై గ్రామంలోకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.. గ్రామం నుంచి వజినేపల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు వారిని కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో భానుసాయి మృతిచెందాడు. కిరణ్‌ను మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
ఇటుక బట్టీ యాజమాని అరెస్ట్
చివ్వెంల : ఇటుక బట్టీలో పనిచేస్తున్న వ్యక్తి మృతికి కారణమైన యాజమానిని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. బుధవారం సీఐ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామ శివారులోని శ్రీశ్రీనివాస ఇటుక బట్టీలో పనిచేస్తున్న పల్లపు రాజు ఇటుకలు తయారుచేసే మట్టిని ట్రాక్టర్‌తో తొక్కిస్తుండగా.. ఒక్కసారిగా ట్రాక్టర్ తిరగబడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ట్రాక్టర్ సరిగా పనిచేయడం లేదని కొంతకాలంగా ఇటుక బట్టీ యాజమాని చల్లా నాగరాజుకు చెబుతున్నా పట్టించుకోలేదని రాజు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి తోడు ట్రాక్టర్‌కు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కూడా లేదని పేర్కొన్నారు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి రాజు మృతికి కారణమైన ఇటుక బట్టీ యజమాని చల్లా నాగరాజును బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ట్రాక్టర్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ మహేశ్వరం కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.


