ఆలయంలో హుండీ అపహరణ | - | Sakshi
Sakshi News home page

ఆలయంలో హుండీ అపహరణ

Feb 26 2026 9:35 AM | Updated on Feb 26 2026 9:35 AM

ఆలయంలో హుండీ అపహరణ

ఆలయంలో హుండీ అపహరణ

మర్రిగూడ : మర్రిగూడ మంండల కేంద్రంలోని శ్రీశంభు రామలింగేశ్వరస్వామి ఆలయంలోకి మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి హుండీ ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం ఆలయం వద్దకు వచ్చిన అర్చకుడు లోక వెంకటశర్మ చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా సాయంత్రం ఆలయ సమీపంలో హుండీ దొరకగా.. అందులోని నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సీతారామాంజనేయ

దేవాలయంలో చోరీ..

తిప్పర్తి : మండలంలోని సిలార్‌మియాగూడెంలో గల సీతారామాంజనేయ దేవాలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. తులం బంగారం, ఐదు తులాల వెండి వస్తువులు, హుండీలోని సుమారు రూ.50వేల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలయ చైర్మన్‌ యర్రమాద నరేందర్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఆరునెలల క్రితం కూడా ఇదే ఆలయంలో దుండగులు హుండీ ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement