నకిలీ బంగారం ముఠా అరెస్ట్
ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన శాలిగౌరారం పోలీసులు నల్లగొండ సీసీఎస్ పోలీసుల సహకారంతో రాజు తీసిన ఫొటో, సెల్‌ఫోన్ టవర్ ఆధారంగా మాల్యాద్రిపై నిఘా పెట్టారు. బుధవారం శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా మాల్యాద్రి దంపతులు, అతడి తమ్ముడి కుమారుడు కిషోర్ అటుగా వెళ్తూ పట్టుబడ్డారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా.. నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారని సీఐ తెలిపారు. వారి నుంచి నకిలీ బంగారు వడ్డానం, నల్లపూసల గుండ్లు, రూ.50 వేల నగదు, ఆటో, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వీరు తెలంగాణలో ఆరు చోట్ల, ఏపీలో ఒక చోట ఇదేవిధంగా మోసం చేసినట్లు సీఐ తెలిపారు.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ బంగారు వడ్డానం, నల్లపూసల గుండ్లు
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న
శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి
శాలిగౌరారం: నకిలీ బంగారం అంటగడుతూ మోసాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను నల్లగొండ సీసీఎస్ పోలీసుల సహకారంతో శాలిగౌరారం పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లా జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన కర్రెద్దుల మాల్యాద్రి అలియాస్ వెంకటేశ్వర్లు, ఆయన భార్య సుబ్బమ్మ అలియాస్ సుభాషిని, మాల్యాద్రి తమ్ముడి కుమారుడు కిషోర్ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ముగ్గురు ఈ నెల 6న నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామాంజాపురం గ్రామానికి వచ్చి, తాము బాతులు మేపుకునే వాళ్లమని పరిచయం చేసుకుని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బస చేశారు. ఈ క్రమంలో మాల్యాద్రి, సుబ్బమ్మ గ్రామంలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్న చిలుకూరి రాజుతో పరిచయం పెంచుకున్నారు. మరుసటి రోజు తమ వద్ద 35 తులాల బంగారం ఉందని, ప్రస్తుతం డబ్బులు అవసరం ఉండడంతో తక్కువ ధరకు ఇస్తామని మాల్యాద్రి దంపతులు రాజుకు చెప్పారు. రాజును నమ్మించేందుకు తమ వద్ద ఉన్న మూడు బంగారు నల్లపూసల గుండ్లతో పాటు మరో బంగారం ముక్కను ఇచ్చి పరీక్షించుకోమన్నారు. వారిచ్చిన బంగారాన్ని రాజు బంగారం షాపులో పరీక్షించగా.. అది అసలైన బంగారమే అని తేలడంతో వెంటనే చేతికి ఉంగరం కూడా చేయించాడు. అనంతరం మాల్యాద్రి, సుబ్బమ్మ తమ వద్ద ఉన్న నకిలీ బంగారం అమ్మేందుకు రాజుతో బేరసారాలు చేశారు.
35 తులాల బంగారం..
రూ.7 లక్షలకు కొనుగోలు..
తమ వద్ద ఉన్న 35 తులాల నకిలీ బంగారాన్ని రూ.20 లక్షలకు అమ్ముతామని మాల్యాద్రి దంపతులు రాజుకు చెప్పారు. చివరకు రూ.7 లక్షలకు బేరం కుదరడంతో రాజు వెంటనే వారికి డబ్బులు ముట్టజెప్పాడు. ఈ క్రమంలో రాజు రహస్యంగా తన సెల్‌ఫోన్‌లో మాల్యాద్రిని ఫొటో తీశాడు. అనంతరం రాజు మరుసటి రోజు ఆభరణాలు చేయించేందుకు బంగారం దుకాణం వద్దకు వెళ్లగా అది నకిలీ బంగారమని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫ నకిలీ బంగారు వడ్డానం, నల్లపూసల గుండ్లు, రూ.50 వేల నగదు, ఆటో, ద్విచక్ర వాహనం స్వాధీనం
నకిలీ బంగారం ముఠా అరెస్ట్


