రానికెట్‌ వ్యాధితో నాటుకోళ్లు మృతి | - | Sakshi
Sakshi News home page

రానికెట్‌ వ్యాధితో నాటుకోళ్లు మృతి

Feb 27 2026 4:03 AM | Updated on Feb 27 2026 4:03 AM

రానికెట్‌ వ్యాధితో  నాటుకోళ్లు మృతి

రానికెట్‌ వ్యాధితో నాటుకోళ్లు మృతి

రామగిరి(నల్లగొండ): రానికెట్‌ అనే వ్యాధితో నల్లగొండ మండలంలోని కేశరాజుపల్లి గ్రామానికి చెందిన ఆతి మల్లయ్య ఫామ్‌లో 200 నాటుకోళ్లు మృతిచెందాయి. ఇటీవల ఖాజీరామారంలోనూ ఓ రైతు ఫామ్‌లో 800 వరకు నాటుకోళ్లు, అప్పాజిపేటలో పెరటి కోళ్లు ఈ వ్యాధితో మృతిచెందాయి. నాటుకోళ్లు, బాయిలర్‌ కోళ్లకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని వెటర్నరీ డాక్టర్‌ కోట్ల సందీప్‌రెడ్డి తెలిపారు. ఆయన కేశరాజుపల్లిలోని రైతు ఫామ్‌ను గురువారం సందర్శించారు. ప్రస్తుతం రానికెట్‌ వ్యాధి ప్రభావం ఎక్కుగా ఉందని చెప్పారు. ఈ వ్యాధి సోకకుండా ముందస్తుగా కోళ్లకు లసోటా వ్యాక్సిన్‌ వేయించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement