ఏటీఎంలో నుంచి చిరిగిన నోట్లు
భూదాన్‌పోచంపల్లి : ఏటీఎం నుంచి ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేయగా.. ఎలుకలు కొరికినట్లు ఉన్న రూ.500 నోట్లు వచ్చాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి మండల పరిధిలోని కప్రాయిపల్లి గ్రామానికి చెందిన గంగదేవి జంగయ్య బుధవారం సాయంత్రం తన కుమారుడు సుభాష్‌కు ఏటీఎం కార్డు ఇచ్చి రూ.10 వేలు డ్రా చేసుకొని రమ్మని చెప్పాడు. దీంతో సుభాష్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు వెళ్లి అందులో నుంచి డబ్బులు డ్రా చేయగా.. ఎలుకలు కొరినట్లుగా ఉన్న నాలుగు రూ.500 నోట్లు వచ్చాయి. వెంటనే సుభాష్ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చేందుకు బ్యాంకు వద్దకు వెళ్లగా తాళం వేసి ఉండటంతో ఇంటికి వెనుతిరిగి వెళ్లాడు.


