అభ్యసన సర్వే పూర్తి | - | Sakshi
Sakshi News home page

అభ్యసన సర్వే పూర్తి

Mar 1 2026 7:19 AM | Updated on Mar 1 2026 7:19 AM

అభ్యసన సర్వే పూర్తి

అభ్యసన సర్వే పూర్తి

అడ్డగూడూరు: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న రెండో తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పరిశీలించేందుకు స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వే ముగిసింది. గత నెల 25, 26, 27వ తేదీల్లో మూడురోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. జిల్లా ఎంపిక చేసిన బడుల్లోనే ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌లో భాగంగా నిర్వహించిన సర్వే బాధ్యతలను ఉపాధ్యాయులకు కాకుండా ప్రస్తుతం బీఈడీ చదువుతున్న విద్యార్థులకు అప్పగించారు. వీరిని ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లుగా నియమించారు. సర్వే నిర్వహణపై ఎంపిక చేసిన వారికి జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ఎన్‌సీఈఆర్టీ ద్వారా ఎంపిక చేసిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేశారు. మొదటి రోజు తెలుగు భాషపై వివరాలు సేకరించారు. రెండో రోజు గణిత అభ్యసన సామర్థ్యాలపై, మూడో రోజు ఇంగ్లిష్‌ భాషకు సంబంధించి వివరాలను సేకరించారు.

ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో సర్వే

అభ్యసన సర్వేను జిల్లాలో ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో నిర్వహించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేశారు. జాతీయ విద్యావిధానం 2020 ప్రకారం.. ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ కార్యక్రమాన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. తరగతుల వారీగా చవదడం, రాయడంతోపాటు, గణితంలో నాలుగు రకాల ప్రాథమిక ప్రక్రియలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 2026– 27 నాటికి విద్యార్థులు ప్రాథమిక నైపుణ్యాలను సాధించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌లో సాధించిన ఫలితాలను బేరీజు వేసేందుకు చేపట్టిన ఈ సర్వే ఈనెల 27తో ముగిసింది.

ఫ గత నెల 25, 26, 27వ తేదీల్లో కొనసాగిన ప్రక్రియ

ఫ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించిన ఇన్వెస్టిగేటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement