ఆన్‌లైన్‌లోనూ మార్కెటింగ్ చేసుకోవచ్చు
భూదాన్‌పోచంపల్లి: సొంత వెబ్‌సైట్ క్రియేట్ చేసి ఆన్‌లైన్‌లో, ఇతర సామాజిక మాధ్యమాల సాయంతోనూ చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేసుకోవచ్చని నూతన కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం ఆయన పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘంలో అధికారులు, సంఘం పాలకవర్గంతో సమావేశమయ్యారు. సంఘం ద్వారా చేనేత కార్మికులకు కల్పిస్తున్న ఉపాధి, అనుసరిస్తున్న మార్కెటింగ్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాపునర్వి హ్యాండ్లూమ్‌ను సందర్శించి నూలు, చిటికి కట్టడం, రంగులద్దకం, రీలింగ్ యూనిట్, మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించారు. నూలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని, వస్త్రోత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ వస్త్రాల తయారీలో అవలంబిస్తున్న నూతన విధానాలను సాయిని భరత్ కలెక్టర్‌కు వివరించారు. అలాగే చేనేత కార్మికుడు పెండెం కృష్ణ ఇంటిని కలెక్టర్ సందర్శించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను నాణ్యతను పాటించాలని సూచించారు. అదేవిధంగా పోచంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ఆరా తీశారు. జలాల్‌పురంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలతో పాటు పట్టణ కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌ను తనిఖీ చేశారు. కాగా.. మున్సిపాలిటీ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న స్మశానవాటికకు నిధులు ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు కలెక్టర్‌కు విన్నవించారు. ఆయన స్పందించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట డీఈఓ సత్యనారాయణ, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, డీఓ బాలమోహన్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, ఎంఈఓ ప్రభాకర్, ఆర్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, ఎస్‌ఓ ఇందిర, రుద్ర ఆంజనేయులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి
ఆన్‌లైన్‌లోనూ మార్కెటింగ్ చేసుకోవచ్చు


