భ్రూణ హత్యలు నివారించాలి | - | Sakshi
Sakshi News home page

భ్రూణ హత్యలు నివారించాలి

Mar 1 2026 7:19 AM | Updated on Mar 1 2026 7:19 AM

భ్రూణ హత్యలు నివారించాలి

భ్రూణ హత్యలు నివారించాలి

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మనోహర్‌

భువనగిరి: భ్రూణ హత్యలను పూర్తిగా నివా రించాలని, ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మనోహర్‌ అన్నారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, ప్రచారం చేయడం, సహకరించడం చట్ట విరుద్ధమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకోక తప్పదన్నారు. గర్భిణుల పర్యవేక్షణ, అల్ట్రాసౌండ్‌ కేంద్రాల తనిఖీలు, రికార్డుల సమగ్ర పరిశీలన, సీ సెక్షన్‌ ఆడిట్‌ నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్‌ ఎల్‌ యశోధ, వీణ, నిర్మల, శ్రీదేవి, అరుంధతి, ప్రజా సంబంధాల అధికారి నాగరాజు, శివలింగం, తాజోద్దీన్‌, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement