అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందాలి

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందాలి

అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందాలి

భూదాన్‌పోచంపల్లి: సర్పంచ్‌లు అభివృద్ధి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలని భువనగిరి డీఎల్‌పీఓ బి. శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పురం గ్రామంలో గల స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మూడో విడతగా భువనగిరి, యాదగిరిగుట్ట, రాజాపేట, మోత్కూర్‌ మండలాలకు చెందిన 90 మంది నూతన సర్పంచ్‌లకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ చట్టం, ఉపాధిహామీ పథకం, సర్పంచ్‌ల విధులు, గ్రామపంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు, గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌ రాములు, టీఓటీలు రాపర్తి భాస్కర్‌, నవీన్‌కుమార్‌, మాజిద్‌, దినకర్‌, వెంకటేశ్వర్లు, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement