కాలువల పనులు పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

కాలువల పనులు పూర్తిచేయాలి

Mar 1 2026 7:19 AM | Updated on Mar 1 2026 7:19 AM

కాలువల పనులు పూర్తిచేయాలి

కాలువల పనులు పూర్తిచేయాలి

సాక్షి, యాదాద్రి : భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా సాగు నీటి కాలువల ఆధునీకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం భువనగిరిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలపై అధికారులు, రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.485 కోట్లతో బునాదిగాని కాలువ ధర్మారెడ్డి పల్లి కాలువ, పిల్లాయిపల్లి కాలువల పనులు చేపట్టామన్నారు. వచ్చే మూడు నెలల్లోపు కాలువలు పూర్తి చేయాలన్నారు. కాలువల వెంబడి ఉన్న విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను పక్కకు తీయడం, బస్వాపూర్‌ హైలెవల్‌ కెనాల్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బోల్లెపల్లి, భీమలింగం, అలీనగర్‌ కాలువల పునరనిర్మాణం కోసం కావాల్సిన అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని నీటిపారుదల, రెవెన్యూ అధికారులకు సూచించారు. సమావేశంలో భువనగిరి, పోచంపల్లి మున్సిపల్‌ చైర్మన్లు తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్‌, తడక వెంకటేశం, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ రవీందర్‌, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎస్‌డీసీ (భూసేకరణ) జగన్నాథ రావు, నీటి పారుదల శాఖ ఈఈలు శైలేందర్‌, ఖుర్షీద్‌, గ్రంథాలయం చైర్మన్‌ అవేజ్‌ చిస్తీ, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement