సవాళ్లను సాంకేతికతతో అధిగమించాలి
భూదాన్‌పోచంపల్లి : సామాజిక సవాళ్లకు సాంకేతికత ద్వారా పరిష్కార మార్గాలు చూపాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య అన్నారు. శనివారం పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో సీఎస్‌ఈ, ఏసీఎస్‌ఈ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్కిల్–స్ప్రింట్ 2.0 హ్యాకథాన్’ ముగింపు సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. సమాజానికి ఉపయోగపడే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని కోరారు. అనంతరం యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్‌రావు మాట్లాడుతూ.. వినూత్న ఆలోచనలతోనే నూతన ఆవిష్కరణలు జరుగుతాయని అన్నారు. ఆ దిశగా విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో టీమ్ వర్క్, ప్రాక్టికల్ దృక్ఫథాన్ని పెంపొందించడానికి హ్యాకథాన్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కాగా 24 గంటల పాటు నిరంతరాయంగా నిర్వహించిన హ్యాకథాన్‌లో విద్యార్థులు సుస్థిర, పర్యావరణంపై ప్రాజెక్ట్‌లు ప్రదర్శించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ డేటా కంపెనీ డీఎం శివకుమార్, ప్రాక్టీస్ హెడ్ శీరం నాగేశ్వర్‌రావు, ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
ఫ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి
పూనం మాలకొండయ్య


