దప్పిక తీర్చిన సోలార్ బోర్లు
చందంపేట : వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో వణ్యప్రాణుల దప్పిక తీర్చడానికి అటవీ శాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 14,719 హెక్టార్లలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఎండ వేడిమికి తట్టుకోలేక దాహం తీర్చుకునేందుకు జంతువులు జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు గతంలో ట్యాంకర్ల ద్వారా నీటి కుంటలు, సాసర్ పిట్‌లను నింపేవారు. ప్రస్తుతం సోలార్ విద్యుత్ సహాయంతో ఐదు బోర్ల ద్వారా నీటి కుంటలను నింపుతున్నారు. ఈ చర్యలతో గతంతో పోలిస్తే అటవీ జంతువుల సంఖ్యతో పాటు చిరుత పులులను కూడా గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి చందంపేట మండలాన్ని ఆనుకొని ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో జింకలు, ఎలుగుబంట్లు, దుప్పులు, మను బోతులు, చిరుతపులులు, పులులు, అటవీ కుక్కల సంఖ్య పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నీరు తాగేందుకు కుంటల వద్దకు వచ్చే ఈ జంతువులను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జంతువుల అడుగులను బట్టి వాటిని నిర్ధారిస్తుంటారు.
నల్లమల అటవీ ప్రాంతంలో సోలార్ విద్యుత్‌తో బోర్ల ద్వారా నీటి కుంటలు నింపుతున్న అటవీ అధికారులు
వేసవిలో వణ్యప్రాణులకు 24 గంటల పాటు అందుబాటులో నీరు
దప్పిక తీర్చిన సోలార్ బోర్లు
దప్పిక తీర్చిన సోలార్ బోర్లు


