కేసుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
భువనగిరిటౌన్ : పోక్సో కేసులు జాప్యం లేకుండా పరిష్కరించాలని పోక్సో కోర్టు ప్రత్యేక అదనపు జిల్లా న్యాయమూర్తి మిలింద్ కాంబ్లీ ఆదేశించారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా న్యాయమూర్తి జయరాజు సూచనల మేరకు జిల్లా కోర్టు ఆవరణలో పోక్సో కేసుల పరిష్కారం, బాధితుల రక్షణ, పునరావాసం అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీపీ, పోలీసు, చైల్డ్‌లైన్ శాఖల వారికి పోక్సో కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, జేజేబీ కోర్టు న్యాయమూర్తి స్వాతి, సీడబ్ల్యూసీ అధ్యక్షులు బండారు జయశ్రీ, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ అనంత లక్ష్మి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ రెడ్డి, సఖి ఓన్ స్టాఫ్ సెంటర్ సెంట్రల్ అడ్మిన్ విన్ని, భువనగిరి టౌన్ ఎస్‌ఐ నరేష్ పాల్గొన్నారు.


